నెల్లూరు: నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయండి

71చూసినవారు
నెల్లూరు: నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయండి
నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలకు నోటీసులను జారీ చేసి చార్జిషీట్లు ఫైల్ చేయాలని కమిషనర్ వై. ఓ నందన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు నగరంలోని 33వ డివిజన్ నేతాజీ నగర్ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో భవనాల నిర్మాణాలకు కొలతలు వేసి అసెస్మెంట్ డిమాండ్ లతో సరిపోల్చి చూసారు.

సంబంధిత పోస్ట్