వృద్ధులు, నిరాశ్రయులను ఆదరించడం అందరి బాధ్యతని పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సింగంశెట్టి మురళీమోహన్ రావు అన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయంలోని వృద్ధాశ్రమంలో యువ గాయకుడు అబ్దుల్ మసీద్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జయ ప్రకాష్, బలరామ నాయుడు, రమాదేవి పాల్గొన్నారు.