నెల్లూరు: చిరస్థాయిగా జ్యోతిరావు పూలే స్థానం

68చూసినవారు
నెల్లూరు: చిరస్థాయిగా జ్యోతిరావు పూలే స్థానం
భారతదేశ సామాజిక ఉద్యమ చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే స్థానం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ 
ఒ. ఆనంద్‌ అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్‌లో జ్యోతిరావుపూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి కలెక్టర్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం మహనీయుడు పూలే అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్