నెల్లూరు జిల్లాలో యదేచ్చగా దోపిడీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణను ఎదుర్కొనే దమ్ము లేక పరారయ్యాడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఓ కేసు విషయంలో నెల్లూరులో రైల్వే కోర్టుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై 17 కేసులు బనాయించిన ధైర్యంగా ఎదుర్కొన్నానన్నారు.