నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ ఇన్ చార్జి సీఈవో మోహన్ రావుతో కలిసి కారుణ్య నియామకం కింద గురువారం చింతా ప్రదీప్ బాబుకు టైపిస్ట్ గా ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ పరిపాలన అధికారి వి. కొండయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.