నెల్లూరు రూరల్ పరిధిలోని 21, 22 డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు, అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్షించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. నెల్లూరు రూరల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ నెలాఖరు లోపల పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.