నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ సమస్యల పై కమిషనర్ సూర్య తేజతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం బేటి అయ్యారు. అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై ఎస్ఈ మరియు ఈఈలతో ప్రత్యేకంగా చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.