బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 4న 'ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం' జరుపుకుంటారని, అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ స్మరించుకున్నారు. నెల్లూరు కలెక్టర్ బంగ్లా సమీపంలోని పార్కులో లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి మేయర్ నివాళులు అర్పించారు.