నెల్లూరు: వివాహిత బలవన్మరణం

59చూసినవారు
నెల్లూరు: వివాహిత బలవన్మరణం
నెల్లూరు రూరల్ కల్లూరుపల్లిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లూరుపల్లిలో ఆర్డీటీ కాలనీకి చెందిన బాషా, మరియమ్మల కుమార్తె రజియ (23)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలానికి భర్త నుంచి విడిపోయి తల్లి వద్ద ఉంటోంది. రజియకు కుమారుడు ఉన్నాడు. కాగా తల్లి తిట్టిందని రజియ మనస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

సంబంధిత పోస్ట్