నెల్లూరు: వివాహిత అదృశ్యం

6చూసినవారు
నెల్లూరు: వివాహిత అదృశ్యం
నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో వివాహిత అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన భార్య తరచూ ఫోనులో మాట్లాడుతూ ఉండటంతో దంపతుల మధ్య మన్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ నెల రెండో తేదీన దంపతులు, తమ బంధువుతో కలిసి ఊరెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. అక్కడ నుంచి వివాహిత అదృశ్యమైంది. శనివారం చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్