నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజక వర్గ పరిధిలోని 47 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు రూ. 47. 84 లక్షలు విలువైన చెక్కులను శనివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.