నెల్లూరు నగరంలో ఆదివారం మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నవాబ్ పేట, వెంకటేశ్వరపురం ప్రాంతాల్లో పునరుద్ధరించిన అబ్దుల్ కలాం పార్కులను ప్రారంభించారు. ఎన్టీఆర్ నగర్, రాయిపాలెం ప్రాంతాల్లో సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. కోటమిట్ట షాది మహల్ సెంటర్లో క్లీనింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.