నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి మంత్రి నారాయణ ఒంటెద్దు పోకడలకుపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు.