నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మంత్రి నారాయణ సహకారం మరువలేనిదన్నారు.