నెల్లూరు వి ఆర్ హైస్కూల్ లో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల కళ్ళల్లో అవధులు లేని ఆనందం కనిపించింది. ఇందుకు కారణం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిరుపేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేలా రూపుదిద్దిన విఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల ప్రారంభం మొదలు కావడమే. వీఆర్ హైస్కూల్లో మంత్రి నారాయణ అడ్మిషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.