మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం విద్యతో నేను సరిపెట్టుకోకుండా విద్యార్థి దశ నుంచే క్రీడల్లో కరాటే లాంటి కళల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. హాజీ ఇంతియాజ్ అన్నారు. బుధవారం నెల్లూరు టౌన్ హాల్ లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలుపొందిన వారికి ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ సర్టిఫికెట్లను అందజేశారు.