ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో గురువారం ప్రశ్నించారు. ముఖ్యంగా నెల్లూరులో ఎలాంటి కృషి చేస్తున్నారో వివరించాలన్నారు. ప్రతిపాదిత, లేదా నిర్మాణంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య, వివరాలు, ప్రభుత్వం అందించిన నిధుల వివరాలు ఆరా తీశారు.