రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపిక అందజేశారు. అమరావతి నిర్మాణానికి అలాగే నెల్లూరు నగర అభివృద్ధికి నారాయణ చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.