నెల్లూరు: నెల్లూరులో ముస్లింల నిరసన ప్రదర్శన

74చూసినవారు
వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కోటమిట్ట షాదీ మంజిల్ నుంచి వీఆర్సీ మీదుగా గాంధీ బొమ్మ వరకు ఈ ప్రదర్శన సాగింది. వేలాదిమంది ముస్లింలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మైనార్టీ పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్