మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద లేనిపోని కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని ఆయన కుమార్తె పూజిత ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మనుబోలు బైపాస్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.