నెల్లూరు: డెంగ్యూ పాజిటివ్ కేస్ ప్రాంతంలో అధికారుల పర్యటన

68చూసినవారు
నెల్లూరు: డెంగ్యూ పాజిటివ్ కేస్ ప్రాంతంలో అధికారుల పర్యటన
నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోని సప్తగిరి వీధిలో డెంగ్యూ పాజిటివ్ కేస్ ప్రబలిన ప్రాంతంలో శనివారం అధికారులు పర్యటించారు. లార్వా సర్వే, పిడిపి వర్క్ , ఇండోర్ స్పేస్ స్ప్రే, ఫీవర్ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. ఇంటి పరిసరాలలో అనవసరపు నీటి నిల్వలు లేకుండా చూసుకొని దోమల పెరుగుదల జరగకుండా చూడాలని తెలియజేశారు. రాత్రిపూట నిద్రించేటప్పుడు దోమతెరలు వాడాలన్నారు.

సంబంధిత పోస్ట్