నెల్లూరు గ్రామీణ మండలం సౌత్ రాజుపాలెంలో శివయ్య అనే వ్యక్తి గాయపడిన ఘటనపై శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఈ నెల 11న తన బైక్ పై నవాబుపేటలోని స్నేహితుడు రామారావు వద్దకు వెళ్లారు. ఆయనతో కలిసి అల్లీపురం రోడ్డు వైపు నుంచి జాతీయ రహదారి మీదికి వెళ్తుండగా కారు వేగంగా బైక్ ను ఢీకొంది. ఘటనలో శివయ్య నడుముకు తీవ్ర గాయాలు కాగా రామారావుకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం చెన్నైకు తరలించారు.