గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి నారాయణ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నెల్లూరు నగరంలోని సంతపేట, తూకుమానుమిట్టలో శుక్రవారం జరిగింది. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ పేదల అభి వృద్ధి కోసమే పీ4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు చేపట్టారని తెలిపారు.