అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని. అడిగితే తనపై దాడికి పాల్పడ్డారని ఓ మహిళ సోమవారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సాదావారిపాలెంలో ఉండే అరుణ అదే గ్రామానికి చెందిన కల్యాణ్ కు కొంతకాలం క్రితం రూ. 4లక్షలు అప్పుగా ఇచ్చింది. తిరిగి నగదు ఇవ్వమని కోరితే మాటామాటా పెరిగి కల్యాణ్, అతని భార్య, అత్త కలిసి ఆమెపై దాడి చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.