ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో సహాయక చర్యల ప్రత్యేక బృందాలను సిధ్దంగాసిద్ధంగా ఉంచి, పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతే 112 లేదా 939290 3413 కు ఫోన్ చేయాలని సూచించారు.