నెల్లూరు: పోలీస్ అధికారుల తనిఖీలు

58చూసినవారు
నెల్లూరు: పోలీస్ అధికారుల తనిఖీలు
జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు గురువారం రాత్రి పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రాత్రి 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు వాహనాల తనిఖీ చేపట్టారు. అన్ని కూడళ్ళు, హైవే, ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ప్రజల కోసం నెల్లూరు పోలీసులు ఉన్నారనే భద్రత భావాన్ని ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్