విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా కాపాడాలని నెల్లూరు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు స్వర్ణ రమణారావు డిమాండ్ చేశారు. అందులో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. శనివారం గుంటూరులో నిర్వహించిన యూఈ ఈయూ రాష్ట్ర మహా సభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ సంస్థల కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.