రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర" కార్యక్రమంలో భాగంగా "బీట్ ది హీట్" అంశంపై ఈనెల 17 వ తేదీ శనివారం జరిగే కార్యక్రమాల్లో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం కల్పించాలని కమిషనర్ నందన్ ఆదేశించారు. గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.