నెల్లూరు నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ వర్కర్ గా పనిచేస్తూ మరణించిన మేకల శివకుమార్ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా ఆయన కుమారుడు మేకల సుజిత్ కు పబ్లిక్ హెల్త్ వర్కర్ గా విధులను కేటాయిస్తూ కమిషనర్ వై. ఓ నందన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కారుణ్య నియామకం పత్రాలను మేకల సుజిత్ కమిషనర్ నుంచి అందుకున్నారు.