నెల్లూరు నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం నిర్వహించిన యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలలో బుచ్చి మండలానికి చెందిన 72 సంవత్సరాలు వయసు కలిగిన వి. రమణయ్య యోగభ్యాస ప్రతిభ అత్యంత ప్రశంసనీయమని కమిషనర్ వై. ఓ నందన్ అభినందించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఆవశ్యకతను ఈ వయసులో ప్రదర్శించి రమణయ్య అందరికీ ప్రేరణ కల్పించారన్నారు.