సమస్త మానవళికి వెలుగులు ప్రసాదించే సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ మూలస్థానేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి మహాశివుడిని, అమ్మవారిని దర్శించుకున్నారు.