రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి, ప్రజల సమస్యలపై మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.