వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని డి. ఆర్ ఉత్తమ హోటల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మాట వినకుండా ఆర్టీసీని ఏ విధమైన అభివృద్ధి పరచకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో గత వైసిపి ప్రభుత్వం విఫలమైందన్నారు.