నెల్లూరు: సీపీఎం సీనియర్ సభ్యుడు బాణాల వెంకటేశ్వర్లు మృతి

79చూసినవారు
నెల్లూరు: సీపీఎం సీనియర్ సభ్యుడు బాణాల వెంకటేశ్వర్లు మృతి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ సభ్యుడు కామ్రేడ్ బాణాల వెంకటేశ్వర్లు హఠాత్తుగా గుండె పోటుతో బుధవారం మరణించారు. స్థానిక నవాబుపేట ప్రాంతంలోని బంగ్లా తోటలో బుధవారం వారి స్వగృహం వద్ద అంత్యక్రియలు సాగాయి. సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మోహన్ రావు, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్