జనసేన నేత శ్రీపతిరాము కుమారుడు కిడ్నాప్ కు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు పలువురు జనసేన నేతలు రూరల్ సీఐ గుంజి వేణుకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పావుజన్ని చంద్రశేఖర్, రవికుమార్, నెల్లూరు నగర , రూరల్ వివిధ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.