ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నెల్లూరుకు చెందిన సుభాష్ యాదవ్ ను నియమించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ ఓబీసీ మేధావులు సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అర్. కృష్ణయ్య ఏపీ బీసీ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడుగా మద్దులూరు సుభాష్ యాదవ్ ని నియమించారు. బీసీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేస్తానని సుభాష్ యాదవ్ పేర్కొన్నారు.