జిల్లాలో ఈనెల 19 నుండి ప్రారంభమయ్యే పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్ ఐ ఓ వరప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.