ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సౌజన్యంతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆదివారం నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై. ఓ నందన్ ఆకాంక్షించారు. ఆదివారం నెల్లూరు ఆర్. ఎస్. ఆర్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా ను కమిషనర్ సందర్శించారు. పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళాలో పాల్గొన్నారు.