నెల్లూరు కార్పోరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి తరఫున అభ్యర్థులను పెట్టుకుని గెలిపించుకున్నామని చెప్పే సత్తా కూడా టిడిపి నేతలకు లేకుండా పోయిందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్న పాల్గొన్నారు.