నెల్లూరు రూరల్ 29వ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లో మహాలక్ష్మి దేవాలయంలో జరుగుతున్న పొంగళ్లలో టిడిపి డివిజన్ అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తన మొక్కును తీర్చుకున్నారు. గత ఏడాది పొంగళ్లలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకున్నారు. ఆ మొక్కుబడిని పొంగళ్లలో 100 టెంకాయలు సమర్పించుకుని తీర్చుకున్నారు.