ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ కౌన్సిలింగ్ విధానం వల్ల 50 వేల మంది ఎస్జీటీలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ పోరాటం చేసిందని ఎమ్మెల్సీ, వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ పర్వత చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దీంతో గత్యంతరం లేకుండా ప్రభుత్వం తలొగ్గిందని మంగళవారం సాయంత్రం నెల్లూరులో పేర్కొన్నారు.