జిల్లా సహకార సంఘాల ఆడిట్ అధికారిగా తిరుపాల్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన నెల్లూరు నగరంలోని ఆర్టీసీ సమీపంలో ఉన్న డీసీఓ కార్యాలయంలో జిల్లా సహకార అధికారి గురవప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపాల్ రెడ్డి ప్రస్తుతం కావలి డివిజనల్ సహకార అధికారిగా పనిచేస్తున్నారు. గతంలో ఇన్చార్జి డీసీఓ గా కూడా ఆయన పనిచేసిన సంగతి తెలిసిందే.