టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి పాల్గొన్నారు.