నెల్లూరు నగరంలోని బృందావనంలోని యూనియన్ బ్యాంకు సమీపంలోని మురుగుకాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో నెల్లూరు సంతపేట ఎస్సై బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. 46వ డివిజన్ వీఆర్వో శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.