నెల్లూరు: రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

83చూసినవారు
నెల్లూరు: రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ 4వ నెంబర్ ప్లాట్ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తి గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, బులుగు రంగు జీన్స్ ధరించి ఉన్నాడు. వయస్సు 40 ఏళ్లలోపు ఉంటుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్