జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగ్గకుండా విక్రయించుకునేలా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరు వారి చాంబర్‌లో వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.