రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులోని అల్లిపురం డంపింగ్ యార్డ్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రూ.50 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు. రాజధాని అభివృద్ధి చూసి తట్టుకోలేకే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.