ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వసతులతో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ బ్లాక్‌ను కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఫిజియోథెరపీ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు.