నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. కమిషనర్ నందన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. టిడ్కో గృహాలు, రోడ్లు, డ్రైనేజీ, ఇంజినీరింగ్ వంటి విభాగాలకు సంబంధించిన సమస్యలపై మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.