నెల్లూరు సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అండగా ఉంటామని పలువులు నేతలు పేర్కొన్నారు. శనివారం నెల్లూరు రాంజీ నగర్ వైసీపీ సిటీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో వైసిపి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్ధిక్ ఆధ్వర్యంలో 48 వ డివిజన్ వైసిపి నాయకులు, కార్యకర్తలు కలిశారు.